అమెరికా చరిత్రలోనే ట్రంప్​ అత్యంత అసమర్థ ప్రెసిడెంట్: బైడెన్

అమెరికా చరిత్రలోనే ట్రంప్​ అత్యంత అసమర్థ ప్రెసిడెంట్: బైడెన్

అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రెసిడెంట్లలో ట్రంప్ ఒకరని ప్రెసిడెంట్ ఎలెక్ట్​ జో బైడెన్ అన్నారు. ప్రెసిడెంట్​గా కొనసాగేందుకు ట్రంప్ ఫిట్​గా లేరని తాను ఏడాదిగా చెప్తూనే ఉన్నానన్నారు. మరో 12 రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్​ను ఇంపీచ్​మెంట్ ద్వారా తొలగిస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. జవాబు దాటవేశారు. ట్రంప్​ను కొత్త ప్రభుత్వం ఏర్పడే జనవరి 20న రోజున తొలగించడమే అతిత్వరగా అవుతుందని కామెంట్ చేశారు. తన ప్రమాణ స్వీకారానికి రానని ట్రంప్ చేసిన ప్రకటన పట్ల బైడెన్ సంతోషం వ్యక్తంచేశారు.

మొదటిరోజే కొత్త ఇమిగ్రేషన్​ బిల్​

ట్రంప్ తెచ్చిన ఇమిగ్రేషన్​ రూల్స్​ దారుణంగా ఉన్నాయని, వాటిని మార్చడానికి కొత్త ఇమిగ్రేషన్ బిల్​ తీసుకొస్తామని జో బైడెన్​ ప్రకటించారు. వైట్​హౌస్​​కు వెళ్లిన మొదటి రోజే ఈ రూల్స్​ రద్దు చేస్తామని అన్నారు.

దాడి చేసినోళ్లపై జనం నిరసన

 

న్యూయార్క్: క్యాపిటల్ బిల్డిం గ్ లోకి చొరబడి అల్లర్లు సృష్టించిన కొంతమంది ఉద్యోగులు ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొం టున్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని జనం డిమాండ్ చేస్తుండడంతో.. కంపెనీలు వారిని జాబ్స్ నుంచి తీసేస్తున్నాయి. మరోవైపు ఆయా కంపెనీలనూ జనం బాయ్​కాట్ చేస్తున్నారు. మేరీలాండ్ లోని ఓ ప్రింటింగ్ కంపెనీలో పనిచేసే వ్యక్తి దాడిలో పాల్గొన్నట్లు సోష ల్ మీడియాలో ఫొటోలు రావడంతో.. మేనేజ్ మెంట్ ఆ ఉద్యోగిని తెల్లారే తీసేసింది. ఇట్ల సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోల్లోని వ్యక్తులను గుర్తిస్తున్న జనం.. వారిని జాబ్స్ నుంచి తొలగించాలని కంపెనీలపై ఒత్తిడి
తెస్తున్నారు. క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి కేసులో ఇప్పటి వరకు 90 మందిని పోలీసులు అరెస్టు
చేశారు.