అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. తన వివాదాస్పద ట్వీట్లతో అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి కారణమైన ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఆయన తన ట్వీట్లతో గొడవను మరింత పెంచే అవకాశముందని ట్విట్టర్ తెలిపింది. ఆయన ఇటీవల చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా దిగ్గజ సంస్థ పేర్కొంది.
క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాను 12 గంటల పాటు నిషేధిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఆ తర్వాత ఆయన ట్వీట్లను తొలగించింది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
For More News..
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది పిల్లలు మృతి
నాలుగేండ్లలో 5 వేల యాక్సిడెంట్లు
ఈ ఏడాది 20 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు
