ఫ్రెంచ్ వైన్ పై 100శాతం టారిఫ్!..మాక్రాన్ కు ట్రంప్ వార్నింగ్

ఫ్రెంచ్ వైన్ పై 100శాతం  టారిఫ్!..మాక్రాన్ కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: అమెరికా, ఫ్రాన్స్ దేశాల మధ్య సరికొత్త ట్రేడ్ వార్ ముంచుకు రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం అమెరికన్ టెక్ దిగ్గజాలపై విధిస్తున్న డిజిటల్ పన్నును రద్దు చేయకపోతే.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వైన్‌‌‌‌లపై 100% టారిఫ్‌‌‌‌లు విధించడం మినహా అమెరికాకు మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ది పోస్ట్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను నేరుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌‌‌‌ కు చెప్పానని వివరించారు. ఫ్రాన్స్ విధిస్తున్న 3% టెక్ పన్నును ఉపసంహరించుకోవాలని, లేదంటే అమెరికా మార్కెట్లో ఆ దేశ వైన్ పరిశ్రమ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఫ్రాన్స్‌‌‌‌లో జీ–7 సమిట్ వేళ ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.