తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు

తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు

టీఎస్ ఎంసెట్( TS EAMCET ) ప‌రీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం EAMCET ఇంజినీరింగ్ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని.. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు మే 10, 11 తేదీల్లో జరగనున్నాయని స్పష్టం చేశారు. కాగా, మే 2వ తేదీ వరకు లేట్ ఫీజుతో ఎంసెట్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని.. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.