ఫోన్లు చేస్తున్నరు.. చలాన్లు కట్టమంటున్నరు

ఫోన్లు చేస్తున్నరు.. చలాన్లు కట్టమంటున్నరు
  • పెండింగ్ ఫైన్ల వసూలుకు పోలీసుల కాల్​సెంటర్
  • వెహికల్స్ ఓనర్లకు వెళ్తున్న ఫోన్లు  
  • ఐదు జిల్లాలు రీజియన్ గా ఏర్పాటు 
  • ఈ- చలాన్ల క్లియరెన్స్ కు కొత్త సిస్టమ్​

‘‘బోయిన్‌‌‌‌పల్లిలో ఉండే విజయ్‌‌‌‌ ప్రైవేట్ ఎంప్లాయ్. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. హెల్మెట్, సిగ్నల్ జంపింగ్‌‌‌‌,రాంగ్‌‌‌‌ సైడ్ డ్రైవింగ్‌‌‌‌ ఇలా మొత్తం పది చలాన్లు జనరేట్​ అయ్యాయి.  మూడేండ్లు గా కట్టడం లేదు. మంగళవారం విజయ్‌‌‌‌కి ట్రాఫిక్ పోలీస్ కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫోన్​ వెళ్లింది. పెండింగ్‌‌‌‌ చలాన్స్ క్లియర్ చేయాలని చెప్పారు. వెంటనే రూ. 4,815 ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో కట్టాడు. ’’

‘‘సైదాబాద్‌‌‌‌కి చెందిన వెంకటేశ్‌‌‌‌ రెండేండ్ల కిందట తన బైక్​ అమ్మాడు.  ఆరు చలాన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని సోమవారం అతనికి కాల్​సెంటర్​ నుంచి పోలీసులు ఫోన్​ చేశారు.  తన బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసుకోలేదని చెప్పాడు. వెంకటేశ్ చెప్పిన వివరాలను కాల్‌‌‌‌ సెంటర్ కానిస్టేబుల్స్ రికార్డ్ చేసుకున్నారు. ’’ 

“ సిద్దిపేట్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన నర్సిరెడ్డికి రెండు రోజుల కిందట మద్దూరు పీఎస్​ ఎస్​ఐ ఫోన్​ చేశాడు. ఫ్యాషన్ ప్లస్ బైక్ పై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే కట్టాలని చెప్పాడు.  నర్సిరెడ్డి పేరుతో ఉన్న బైక్​ను సిటీలో జాబ్ చేస్తున్న కొడుకు వాడుతున్నాడు. పోలీసులు ఫోన్ చేసిన విషయం ఆయన కొడుక్కి చెప్పడంతో చలాన్లు కట్టేశాడు.’’ 

‌‌‌‌హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  జిల్లాల్లో రిజిస్టరైన వెహికల్స్ సిటీలో వాడుతుంటారు. జిల్లాల నుంచి సిటీకి వచ్చి రూల్స్​ బ్రేక్​ చేసి వెళ్లిన వెహికల్స్​కూడా ఇందులో ఉంటాయి. ఇలాంటి వెహికల్స్ ఓనర్లకు కొద్దిరోజులుగా పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. చలాన్లు కట్టాలంటూ కోరుతున్నారు. లేదంటే  లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రోజుకు 1,500 నుంచి 2 వేల మందికి కాల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్​ రూల్స్ బ్రేక్ చేస్తున్న వెహికల్స్ ఓనర్ల నుంచి ఫైన్లు వసూలు చేసేందుకు పోలీసులు కొత్త సిస్టమ్ ​అందుబాటులోకి తెచ్చారు. ఇన్నాళ్లు పెండింగ్ చలాన్ల కట్టాలంటూ వెహికల్ ఓనర్లకు మెసేజ్ లే వెళ్లేవి. ఇప్పుడు కాల్ సెంటర్స్ ద్వారా ఫోన్లు చేసి చలాన్లు వసూలు చేస్తున్నారు.  రోజూ వేల సంఖ్యలో రూల్స్​ బ్రేక్​ చేసిన వెహికల్స్ కు చలాన్లు జనరేట్ అవుతాయి. కానీ వీటి వసూళ్లు మాత్రం సరిగా జరడగం లేదు. ఒక్కో వెహికల్ కు సంబంధించి ఐదారేండ్లుగా చలాన్లు పెండింగ్​లో ఉంటున్నాయి. ఇలా కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. దీంతో పోలీసులు పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ లిమిట్స్ లో కొంత వరకు ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ ను చెక్ చేస్తూ పెండింగ్ చలాన్లను  వసూలు చేస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల్లోని వెహికల్స్ పెండింగ్ చలాన్లు మాత్రం వసూలు కావడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఫోకస్​ చేశారు. ఐదు జిల్లాలను  ఓ రీజియన్ గా ఏర్పాటు చలాన్లు కట్టాలని  ఫోన్లు చేస్తున్నారు.

బషీర్ బాగ్​లో కాల్ సెంటర్ 

సిటీ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో చలాన్ల వసూలుకు బషీర్ బాగ్ లో కాల్ సెంటర్ పెట్టారు. చలాన్లకు సంబంధించి ముందుగా మెసేజ్ చేస్తారు. ఆ తర్వాత కాల్ చేసి కట్టాలని కోరుతారు. లేదంటే వెహికల్ సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాల్స్ చేసేందుకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమించారు. ఒక్కో రీజియన్ కు ఆరుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు.  ఈ – చలాన్లకు సంబంధించిన క్లియరెన్స్ టార్గెట్ ను అన్ని రీజియన్స్ కు ఇచ్చారు. జిల్లా వారీగా కోడ్ నంబర్స్ ఇచ్చి ఎన్ని ట్రాఫిక్ వయొలేషన్స్ ఉన్నాయో వెహికల్స్ నంబర్స్ ను వారికి పంపించారు. వెహికల్ రిజిస్ట్రేషన్ కు లింకైన ఫోన్ నంబర్ కు కాల్ చేసి పోలీసులు ట్రాఫిక్ చలాన్లు వసూలు చేస్తున్నారు.