టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ప్రిలిమ్స్ కీ తో పాటు ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ అధికార వెబ్‌సైట్‌లో ఉంచింది. వీటితో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు.
503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ జూన్ 11వ తేదీన పరీక్ష నిర్వహించింది టీఎస్పీఎస్సీ. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను చేపట్టారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గత అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
