TSPSC : జూన్ 24 నుంచి అందుబాటులో గ్రూప్‌-4 హాల్ టికెట్లు

TSPSC : జూన్ 24 నుంచి అందుబాటులో గ్రూప్‌-4 హాల్ టికెట్లు

హైద‌రాబాద్ : జులై 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 ఎగ్జామ్ నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేప‌థ్యంలో జూన్ 24వ తేదీ నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. 8,180 పోస్టుల కోసం 9 లక్షల 51 వేల 321 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ అధికారులు వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే రావాలని, చివరి నిమిషంలో హడావుడా.. ఇబ్బంది పడొద్దని సూచించారు. 

హాల్‌టికెట్లను ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బంది పడే ప్రమాదం ఉందని తెలిపారు. హాల్‌ టికెట్‌ వెనక భాగంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలన్నీ పొందు పరచామని, వాటిని తప్పక పాటించాలని సూచించారు.