
తెలంగాణలో గ్రూప్- 4 దరఖాస్తులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గడువు పెంచింది. ఇవాళ్టి(జనవరి30)తో గడువు ముగుస్తుండటంతో ఫిబ్రవరి 3 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ఇక ఇప్పటి వరకూ 8 లక్షల 47 వేల 277 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణలో 8039 గ్రూప్-4 ఖాళీల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మే నెలలో గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది.