
నేటికి ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరింది. అయితే నిన్న రాత్రి వరకు సీఎం కేసీఆర్ పెట్టిన గడువును కార్మికులు పట్టించుకోకుండ సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన PM ఖాన్ నిన్న డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఈరోజు మనసు మార్చుకుని తిరిగి సమ్మెలో పాల్గొన్నాడు. 28వేల మంది ఉన్న కార్మికులలో కేవలం 285 మంది డ్యూటీకి వెళ్లారు. అందులో ఒక్కొక్కరు తిరిగి సమ్మె బాట పడుతున్నారు.
మిలియన్ మార్చ్ చేయడానికి ఆర్టీసీ కార్మికులు రెడీ అవుతున్నారు. ఇందుకు బీజేపీ మద్ధతును ఇస్తున్నట్లు ఆర్టీసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. తొందరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలువనున్నట్లు ఆయన చెప్పారు.
మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి