- నేటి నుంచి పాత ధరలే అమలు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా (మార్చి, ఏప్రిల్, మే) అమలు చేసిన ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ ముగిసిందని, జూన్ 1 నుంచి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత చార్జీలు యథావిధిగా అమల్లోకి వస్తాయని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు ఏసీ బస్సుల్లో ప్రయాణం అందుబాటు ధరల్లో ఉండాలనే ఉద్దేశ్యంతో గత మూడు నెలల పాటు ఈ రాయితీని కల్పించామని, ఇప్పుడు ఆ గడువు ముగిసిందన్నారు. ఈ మార్పుపై ప్రయాణికులు ఎటువంటి గందరగోళానికి గురికావద్దని, బస్సు చార్జీలను కొత్తగా పెంచలేదని, కేవలం వేసవి కాలం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన డిస్కౌంట్ గడువు ముగిసిందని పేర్కొన్నారు.
