- ఈ నెల 11 వరకు ఫీజు చెల్లింపు గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (టీటీసీ) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే.లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో 42 రోజుల టీటీసీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో పాటు, గతంలో ఫెయిల్ అయిన పాత బ్యాచ్ అభ్యర్థులు కూడా పరీక్షలకు హాజరుకావచ్చు. అర్హులైన వారు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 11లోగా ఫీజు చెల్లించాలని, రూ.50 ఫైన్‌తో 18 వరకూ చెల్లించవచ్చని చెప్పారు.
