జపాలి దగ్గర తెల్లగా కనిపించిన తాగు నీరు... టీటీడీ రియాక్షన్ ఇది..!

జపాలి దగ్గర తెల్లగా కనిపించిన తాగు నీరు... టీటీడీ రియాక్షన్ ఇది..!

తిరుమలలోని జపాలి ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నీరు తెల్లగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం ( జులై 26 ) ఈ అంశంపై స్పందించింది టీటీడీ. వాటర్ ప్రెజర్ వల్ల ఏర్పడే సూక్ష్మ గాలి బుడగల కారణంగానే నీరు తెల్లగా కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది టీటీడీ. టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ పరీక్షల్లో నీరు స్వచ్ఛమని నిర్దారించింది.

వీడియోలో కనిపించినట్లుగా, కొళాయిలో నుంచి వచ్చిన నీరు కొన్ని సెకన్లలోనే సహజ స్థితికి చేరుకుని పారదర్శకంగా మారుతోందని... అధిక వాటర్ ప్రెజర్ కారణంగా నీటిలో సూక్ష్మ గాలి బుడగలు ఏర్పడటంతో నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తోందని తెలిపారు నిపుణులు.

నీటిలో ఎలాంటి దుర్వాసన, సెడిమెంట్, ఇతర మలినాలు లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ నిపుణులు తెలిపారు. భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది టీటీడీ.