వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యం.. నాతో ఎందుకు పెట్టుకున్నామా అని బాధపడతరు: విజయ్

వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యం.. నాతో ఎందుకు పెట్టుకున్నామా అని బాధపడతరు: విజయ్

చెన్నై: వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ జోస్యం చెప్పారు. నాతో ఎందుకు పెట్టకున్నామా అని డీఎంకే నేతలు బాధపడతారని అన్నారు. డీఎంకే పార్టీ పూర్తిగా దోపిడికి పాల్పడుతోందని ఆరోపించారు. నకిలీ వాగ్ధానాలతో ప్రజలను మోసం చేస్తోందని నిప్పులు చెరిగారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. కాంచీపురంలో 35 గ్రామాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి సొంతిల్లు, ఒక బైక్ ఉండాలనేది మా లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. డీఎంకే తమకు రాజకీయ ప్రత్యర్థి.. బీజేపీ సైద్ధాంతిక శత్రువని స్పష్టం చేశారు. 

పొత్తుల విషయంలో తన క్లారిటీ తనకు ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు విద్యను మార్చడం, కుల గణన నిర్వహించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడం తమ పార్టీ విధానాలని పేర్కొన్నారు.  కాగా, కరూర్ తొక్కిసలాట దృష్ట్యా విజయ్ సభపై పోలీసుల ఆంక్షలు విధించారు. కేవలం రెండు వేల మందికి మాత్రమే అనుమతించారు. క్యూఆర్‌ కోడ్‌‎తో కూడిన పాస్‎లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు.