జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో.. టీవీఎస్ మోటార్ కు 4.9 శాతం వాటా

జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో.. టీవీఎస్ మోటార్ కు 4.9 శాతం వాటా

న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ జన్​ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4.9 శాతం వాటాను రూ.193.32 కోట్లకు కొననున్నట్లు ప్రకటించింది. టీవీఎస్ వేణు సంస్థ జన్​ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారెంట్లు, సెకండరీ పర్చేజ్ ద్వారా మొత్తం 9.9 శాతం వరకు మైనారిటీ వాటాను పొందే ఒప్పందంలో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది. 

జన్​ హోల్డింగ్స్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన ఈ ఒప్పందానికి టీవీఎస్ మోటార్ బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2026 మే 18 నాటికి ఉన్న పెయిడ్- అప్ షేర్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 51,60,903 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తారు. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తికానుంది. ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దేశవ్యాప్తంగా 822 ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లు ఉన్నాయి.