మోదీ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ నుంచి ఇద్దరు సామాన్యులు

మోదీ  ప్రమాణ స్వీకారానికి తెలంగాణ నుంచి ఇద్దరు సామాన్యులు

మోదీ  ప్రమాణ స్వీకారానికి తెలంగాణ నుంచి ఇద్దరు సామాన్యులు హాజరయ్యారు. చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తోన్న సిరిసిల్లకు చెందిన యెల్ది హరి ప్రసాద్, మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం, నర్సింల గూడెంలో ప్రైమరీ స్కూల్ టీచర్ కొడిపాక రమేశ్ కు ఆహ్వానం అందింది. 

కేంద్రం పంపిన ఇన్విటేషన్ లతో వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గతంలో ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంలో భాగంగా హరి ప్రసాద్, కొడిపాక రమేశ్ ల గొప్పతనాన్ని మోదీ మెచ్చుకున్నారు. హరి ప్రసాద్ చేనేత కళ కోసం చేస్తోన్న కృషిని అభినందించారు. తన తల్లి అరుణ తమకు మహాలక్ష్మీ అంటూ దీపావళి సందర్భంగా టీచర్ రమేశ్ రాసిన లేఖకు ముగ్ధుడనయ్యాని ప్రధాని కొనియాడారు.