ప్రధాని మోదీ పర్యటనకు కొద్ది గంటల ముందు వేడుక జరిగే ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కగలీపుర సమీపంలో ఫుట్‌పాత్ పక్కన 2 జిలెటిన్ స్టిక్స్ లభించడం తీవ్ర కలకలం రేపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు వీటిని గుర్తించి వెంటనే నిర్వీర్యం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న క్వారీ పనుల కోసం వీటిని తెచ్చారా? లేక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
