
- మరో ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్లు బదిలీ
- హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు
- సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.
రమాదేవిని నియమిస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ. గౌతమ్ జీవో ఇచ్చారు. ఇప్పటిదాకా రమాదేవి భద్రచాలం సీతారామస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( ఈవో) గా పనిచేస్తుండగా ప్రభుత్వం హౌసింగ్ శాఖకు బదిలీ చేసింది. అలాగే.. మరో డిప్యూటీ కలెక్టర్ అశోక్ చక్రవర్తికి హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా, డిప్యూటీ కలెక్టర్ హరికృష్ణను హన్మకొండ జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమిస్తూ వీపీ గౌతమ్ జీవో ఇచ్చారు. ఇటీవల ఇందిరమ్మ స్కీమ్ కు రెవెన్యూ శాఖ నుంచి ఆరుగురు గ్రూప్ 1 అధికారులను కేటాయించగా, తాజాగా మరో ఇద్దరిని నియమించారు.
హౌసింగ్ బోర్డుకు 320 పోస్టులు శాంక్షన్ అయితే కేవలం 30 మంది మాత్రమే ఉండటంతో గత నెలలో సెక్రటరీ రిటైర్ మెంట్ తో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను నియమించారు. హౌసింగ్ బోర్డుకు వందల ఎకరాల భూములు, హైదరాబాద్ లో 15కు పైగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉండటంవంటి కారణాలతో గ్రూప్ 1 అధికారిని సెక్రటరీగా నియమించారు.