సైఫాబాద్, వెలుగు: లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళా స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు.. మూడు బ్యాగుల్లో తరలిస్తున్న 21.251 కిలోల గంజాయిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నారాయణపేట జిల్లాకు చెందిన తిప్పిగిరి లక్ష్మి (43), ముంబైకి చెందిన సందీప్కౌర్ (60)గా గుర్తించారు. విశాఖపట్నంలో శ్రీను అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసిన ఈ గంజాయిని ముంబైలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
చరస్ సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్: బంజారాహిల్స్ భోలా నగర్లో చరస్ సేవిస్తున్న షేక్ ఆరిఫ్ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 12 వేల విలువైన 46 గ్రాముల చరస్‌ను, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ చరస్‌ను మహారాష్ట్రలోని పర్భణిలో కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
