రంగారెడ్డి జిల్లాలో విషాదం..గూడ్స్ రైలు ఢీకొని ఇద్దరు యువతులు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం..గూడ్స్ రైలు ఢీకొని ఇద్దరు యువతులు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. నందిగామ గ్రామ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

గూడ్స్ రైలు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం... నందిగామ శివారు ప్రాంతంలో ఇద్దరు యువతులు కట్టెల మోపుతో రైల్వే ట్రాక్ దాటుతుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు వారిని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం అదే గూడ్స్ రైలులో షాద్‌నగర్‌కు తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.