విండీస్ బౌలర్ వింత సెలబ్రేషన్స్.. వికెట్ పడగానే గాల్లోకి పల్టీలు

విండీస్ బౌలర్ వింత సెలబ్రేషన్స్.. వికెట్ పడగానే గాల్లోకి పల్టీలు

ఏ క్రీడలోనైనా ఆటగాళ్లు రాణించినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవడమన్నది కామన్. ఆ స్టైల్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది. ఉదాహరణకు దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ అనుకోండి. 'షూ' తీసి చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ చేసినట్లు పోజులిస్తాడు. ఇలా సెలెబ్రేట్ చేసుకోవడంలో వెస్టిండీస్ బౌలర్ కెవిన్ సింక్లెయిర్ మరో లెవెల్ అని చెప్పుకోవాలి. ఆనందంతో గాల్లోకి పల్టీలు కొట్టడం  సింక్లెయిర్ ప్రత్యేకత.

యూఏఈతో జరిగిన మ్యాచులో సింక్లెయిర్ బౌలింగ్‌తోనే కాకుండా తన సెలబ్రేషన్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. మూడో వన్డేలో 4 వికెట్లు తీసిన ఈ విండీస్ వీరుడు.. సంతోషాన్ని పట్టలేక వినూత్న రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. వికెట్ తీసినప్పుడల్లా.. అమాంతం గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సింక్లెయిర్‌కు ఈ తరహా సెలబ్రేషన్స్ కొత్తేం కాదు. గతంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇదే తరహా సెలబ్రేషన్స్ చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చాలామంది అభిమానులు అతని సెలెబ్రేషన్‌ను 'గ్రావిటీ డిఫైయింగ్‌' (భూమ్యాకర్షణ వ్యతిరేక శక్తి)గా అభివర్ణిస్తున్నారు.

ఇక యూఏఈతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్‌ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. 

https://twitter.com/ICC/status/1667356005267656705

https://twitter.com/Abdullah__Neaz/status/1667195847606673408