న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఫ్ 100 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. యూడీఎఫ్ అత్యంత పటిష్టంగా, ఐక్యంగా ఉందని ఆయన అన్నారు. పార్టీ సీనియర్ నేత, కన్నూర్ ఎంపీ కె. సుధాకరన్‌ను ఆయన నివాసంలో పార్టీ చీఫ్ ఖర్గేతోపాటు రాహుల్ శనివారం కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పార్టీ అనుమతించకపోవడంతో సుధాకరన్ అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ తోపాటు రాహుల్ స్వయంగా వెళ్లి బుజ్జగించినట్టు తెలుస్తోంది.
