V6 News

యూజీసీ-నెట్ పరీక్షకు షెడ్యూల్ రిలీజ్

యూజీసీ-నెట్ పరీక్షకు షెడ్యూల్ రిలీజ్

యూజీసీ- నెట్ డిసెంబర్ 2022 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ వెల్లడించారు.

మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలి(NTA)కి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.