బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ విజృంభణ కారణంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్ట్రైయిన్ ఎఫెక్ట్ తో బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. వైరస్ నివారణ చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందంటూ ఆయన తన టూర్‌ను విరమించుకున్నారు. దీనికి సంబంధించి జాన్సన్ భారత ప్రధాని మోడీతో మాట్లాడారు. నిన్న రాత్రి ప్రకటించిన జాతీయ లాక్‌డౌన్, కొత్త కరోనావైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండంతో తాను దేశంలో ఉండడం చాలా ముఖ్యమని బోరిస్ జాన్సన్ తెలిపారు.
జనవరి 26, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కావాల్సి వుంది. అయితే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కారణంగా యూకేలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని సోమవారం ప్రకటించారు.
