గంగానదీ ప్రక్షాళనకు యునైటెడ్ నేషన్స్ గుర్తింపు

గంగానదీ ప్రక్షాళనకు యునైటెడ్ నేషన్స్ గుర్తింపు

మాంట్రియెల్ (కెనడా): గంగానదీ ప్రక్షాళన కార్యక్రమానికి యునైటెడ్​ నేషన్స్ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా నేచురల్ వరల్డ్ పునరుద్ధరణకు చేపట్టిన 10 గ్రౌండ్ బ్రేకింగ్ కార్యక్రమాలలో ఇదీ ఒకటని మెచ్చుకుంది. దీనిని వరల్డ్ రీస్టోరేషన్ ఫ్లాగ్ షిప్స్ ప్రోగ్రాంలలో ఒకటిగా చేరుస్తున్నట్లు ప్రకటించింది. కెనడాలోని మాంట్రియెల్ లో జరుగుతున్న యూఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ (కాప్ 15) సందర్భంగా మంగళవారం ఈ మేరకు ఓ రిపోర్టును యూఎన్ విడుదల చేసింది.

‘‘హిమాలయాల నుంచి బంగాళాఖాతం వరకూ 2,525 కిలోమీటర్ల పొడవున ప్రవహించే గంగానది.. వాతావరణ మార్పు, జనాభా పెరుగుదల, ఇండస్ట్రియలైజేషన్, ఇరిగేషన్ వంటి కారణాలతో కలుషితం అయింది. అయితే, గంగను ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టుతో నదిలో పొల్యూషన్ తగ్గింది. గంగా తీరంలో ఫారెస్ట్ కవర్ పెరిగింది. ఈ నదీ తీరం వెంబడి నివసిస్తున్న 5.20 కోట్ల మందికి అనేక రకాలుగా ప్రయోజనం కలిగింది” అని రిపోర్ట్ వెల్లడించింది.