ఆర్టీసీ డ్రైవర్​ పై మేయర్​ పోలీసులకు ఫిర్యాదు.. విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఆదేశం

ఆర్టీసీ డ్రైవర్​ పై మేయర్​ పోలీసులకు ఫిర్యాదు.. విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఆదేశం

దేశవ్యాప్తంగా పిన్న వయస్సులోనే తిరువనంతపురం మేయర్​ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్య రాజేంద్రన్ మరోసారి​ వార్తల్లోకి ఎక్కారు.  ఆమె .. తన భర్త సచిన్​ దేవ్... కెఎస్‌ఆర్‌టిసి బస్సు డ్రైవర్​ తో గొడవ పడ్డారు. ఈ విషయం కేరళ  రవాణా శాఖా మంత్రి   కెబి గణేష్ కుమార్‌కు విన్నవించగా.. కేసు విచారణ పూర్తయ్యేంతవరకు విధులకు దూరంగా ఉండాలని బస్సు డ్రైవర్​ ను ఆదేశించారు.   వివరాల్లోకి వెళ్తే.....

 తిరువనంతపురం  మేయర్-ఎమ్మెల్యే దంపతులు, కొంతమంది బంధువులతో కలిసి కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC)  బస్సు డ్రైవర్ ఎల్‌హెచ్ యాధు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  డ్రైవర్​  ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా..    వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని  ( లైంగిక చర్యలు ప్రేరేపించే విధంగా సైగలతో) మేయర్​ ఆర్య రాజేంద్రన్ మరియు ఆమె కోడలు ఆరోపించారు.  ఈ విషయంలో డ్రైవర్​ కు, మేయర్​ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది.  తన కారు వెళ్లేందుకు స్థలం ఇవ్వలేదని ఆరోపిస్తూ కేఎస్‌ఆర్‌టీసీ బస్సు డ్రైవర్‌పై మేయర్ ఆర్య రాజేంద్రన్  గొడవకు దిగినట్లు తెలుస్తోంది. 

డ్రైవర్​ యాధుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  యాధు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.  ఈ ఘటనలో బస్సు గంట పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మేయర్, ఎమ్మెల్యే, ఇతరులు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని  డ్రైవర్‌ ఫిర్యాదు చేసినా పోలీసులు  చర్యలు తీసుకోలేదు.అయితే ఈ విషయంపై  సోషల్​ మీడియాలో మేయర్​, ఎమ్మెల్యే దంపతులపై విమర్శలు వచ్చాయి. KSRTC డ్రైవర్​ పై  ఫిర్యాదు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు నెటిజన్లు  తప్పుపడుతున్నారు.  అయితే మేయర్​ దంపతులు బస్సును అడ్డుకోలేదని.. ట్రాఫిక్​ సిగ్నల్​ దగ్గర ఆగినప్పుడు బస్సు డ్రైవర్​ తో మాట్లాడామన్నారు.  దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్​ పరిశీలించగా మేయర్​ తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తేలింది.  . 

మేయర్ తాము బస్సును అడ్డుకోలేదని, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు ఆగినప్పుడు డ్రైవర్‌తో మాత్రమే మాట్లాడామని సమర్థించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో మేయర్ వెర్షన్ అవాస్తవమని తేలింది.అయితే మేయర్​ ఈ విషయాన్ని కేరళ రవాణా శాఖ మంత్రి కెబి గణేష్ కుమార్‌కు ఫిర్యాదు చేయగా... కేసు విచారణ పెండింగ్​ లో ఉన్నందున డ్రైవర్​ యాధును విధులక దూరంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. మేయర్-ఎమ్మెల్యే దంపతుల చర్యను సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం సమర్థించుకుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ మాట్లాడుతూ బస్సు డ్రైవర్‌ చేసిన అభ్యంతరకర చర్యలు, హావభావాలు లైంగిక చర్యలు ప్రోత్సహించే విధంగానే ఉన్నాయన్నారు.