ఆయిల్​ఫెడ్ ఆధ్వర్యంలో ఫస్టు నుంచి మార్కెట్​లోకి గానుగ నూనె

ఆయిల్​ఫెడ్ ఆధ్వర్యంలో ఫస్టు నుంచి మార్కెట్​లోకి గానుగ నూనె
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గానుగ పట్టిన పల్లి నూనెను జనవరి 1 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపింది. డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి వచ్చే రోజుల్లో పెద్దమొత్తంలో నూనె అందుబాటులోకి తెస్తామని ఎండీ సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. గానుగ నూనెకు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నాణ్యమైన పల్లీలతో నూనె తీస్తామని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శివరాంపల్లిలో ఉన్న ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ, ప్యాకేజీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా మిషనరీని ఏర్పాటు చేశామని చెప్పారు. విజయ పల్లి నూనె ధర మార్కెట్లో లీటర్​కు రూ. 180 ఉండగా, గానుగ పట్టిన పల్లి నూనె ధర రూ. 280 గా నిర్ణయించినట్లు తెలిపారు. 

ఆరోగ్యానికి చాలా మంచిది.. 

వెయ్యి కిలోల పల్లి గింజలను గానుగ పడితే 400 కేజీల నూనె మాత్రమే వస్తుంది. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరికే సాధారణ పల్లి నూనెను గ్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పల్లీలు కాకుండా అన్ని రకాలు, అన్ని పరిమాణాలతో ఉన్న గింజలను మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. దీంతో పల్లి నూనె ఎక్కువ వస్తుంది. గానుగ పద్ధతిలో తక్కువ నూనె రావడమే కాకుండా, నాణ్యమైన పల్లీలను ఒకే పరిమాణంలో ఉండే గింజలనే వాడాల్సి ఉంటుంది. కూల్ ప్రెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా నూనె స్వచ్ఛంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మంచిదని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు. గానుగ నూనెలతో వంటలు, పిండి వంటలు, పచ్చళ్లు టేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అంటున్నారు.