కానిస్టేబుల్ పోస్టులను 20 వేలకు పెంచాలి..ఇందిరా పార్క్, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల ధర్నా

కానిస్టేబుల్ పోస్టులను 20 వేలకు పెంచాలి..ఇందిరా పార్క్, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: కానిస్టేబుల్ పోస్టులను 20 వేలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నో ఖాళీలను పెట్టుకొని నామమాత్ర పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సోమవారం ఇందిరా పార్క్, అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కానిస్టేబుల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 36 ఏండ్లకు, ఎస్సై అభ్యర్థుల వయోపరిమితిని 38 ఏండ్లకు పెంచాలని, దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో లక్ష మందితో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.