హైదరాబాద్ సిటీ, వెలుగు: వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత దగ్గర చేయాలన్న లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) షాప్ టు షాప్ కస్టమర్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని బుధవారం సైఫాబాద్ రీజినల్ ఆఫీస్హెడ్ అపర్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
రీజియన్ పరిధిలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య కేంద్రాలు, గవర్నమెంట్ఆఫీస్లను సందర్శించి వినియోగదారులతో మాట్లాడారు. బ్యాంక్అందిస్తున్న అధిక వడ్డీ డిపాజిట్స్కీమ్స్, ఎంఎస్‌ఎంఈ, రిటైల్ లోన్లు, బీమా, మొబైల్ బ్యాంకింగ్ యాప్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు.
