ఇవాళ( జూన్ 12) రాష్ట్రానికి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

ఇవాళ( జూన్ 12) రాష్ట్రానికి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్
  • పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి 
  •  12 ఏండ్ల మోదీ పాలనపై మేధావులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ శుక్రవారం తెలంగాణకు రానున్నారు. దేశంలో 12 ఏండ్ల మోదీ పాలన విజయోత్సవాలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌కు రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 26లో మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు నూజివీడు సీడ్స్ ఓనర్, మాజీ ఏబీవీపీ సెక్రటరీ, మాండవా ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2.35 గంటల నుంచి 3:35 గంటల వరకు డీఆర్‌‌‌‌‌‌‌‌డీఎల్‌‌‌‌‌‌‌‌లో పలు కార్యక్రమాల్లో రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ పాల్గొంటారు. అనంతరం సాయత్రం 4 గంటల నుంచి 5.45 గంటల వరకు సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌‌‌‌‌‌‌‌లోని గాయత్రి గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో మేధావులతో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. సాయత్రం 6.30 గంటలకు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ అకాడమీలో అధికారులతో సమావేశమై శుక్రవారం రాత్రి అక్కడే ఆయన బస చేయనున్నారు.

శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటారు. అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్తారు. మరోవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా కూడా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. రెండ్రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.