ఐదురోజుల్లో కోటిన్నర మంది పిల్లలకు వ్యాక్సిన్

ఐదురోజుల్లో  కోటిన్నర మంది పిల్లలకు వ్యాక్సిన్

భారత్ లో కరోనా,ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. భారత్ మరో ఘనత సాధించిందని.. ఇప్పటి వరకు 150 కోట్ల డోసులు దాటిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అంతేగాకుండా జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సినేషన్ స్పీడ్ గా కొనసాగుతోంది. తొలి ఐదురోజుల్లోనే 1.50 కోట్ల మందికి పైగా పిల్లలు ఫస్ట్ డోస్ తీసుకున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో 100 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. కొన్ని రాష్ట్రాల్లో 90 శాతం వ్యాక్సినేషన్ అయ్యింది. 2021 జనవరి 16న భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.