బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ : బండి సంజయ్

బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ : బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమైతదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. దానిలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారన్నారు. తాము అవినీతి, కుటుంబ పార్టీలకు వ్యతిరేకమన్నారు బండి సంజయ్.  బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ .. ఆ పార్టీ ఎందులో కలిసినా ఉపయోగం లేదన్నారు.  విలీనంపై ప్రజలు ఎమనుకుంటున్నారో తెలుసుకోవడానికే బీజేపీలో బీఆర్ఎస్  విలీనమంటూ కాంగ్రెస్సోళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.

 కేసీఆర్   కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి..మళ్లీ కాంగ్రెస్ లోకే వెళ్తారని చెప్పారు బండి సంజయ్.  తమకు ఎవరి మద్దతు అవసరం లేదు... ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు. ఆరు గ్యారెంటీలను పక్కదోవ పట్టించడానికే ఈ ప్రచారానికి తెరలేపారని చెప్పారు. రుణ మాఫీపై రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బ్యాంక్ ల నుండి ఎన్వోసీలు  ఇప్పించాలి.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదన్నారు. రైతుల పక్షాన బీజేపీ  కొట్లాడుతుందన్నారు బండి సంజయ్.