పోక్సో కేసులో బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తన కొడుకు భగీరథ్ ను పోలీసులకు అప్పగించానని చెప్పారు.
బండి సంజయ్ ఏమన్నారంటే.. నిజానికి ఫిర్యాదు వచ్చిన వెంటనే అతడిని స్టేషన్‌లో అప్పగిద్దామనే అనుకున్నాను. కానీ మా అబ్బాయి తను ఏ తప్పూ చేయలేదని పదే పదే చెప్పాడు. లాయర్లను సంప్రదించి మా దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ వారి ముందుంచాడు. ఆ ఆధారాలు చూసిన లాయర్లు... కేసు ఖచ్చితంగా కొట్టేస్తారని, బెయిల్ వస్తుందని చెప్పారు. ఈ రోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు ధీమా వ్యక్తం చేశారు. ఆ నమ్మకంతోనే కొంత జాప్యం జరిగింది తప్ప చట్టం నుండి తప్పించుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే, సోమవారం కోర్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ... శనివారమే(మే 16) మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాను.నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది... నిజమేంటో త్వరలోనే తేలుతుంది అని ప్రకటించారు.
