న్యూఢిల్లీ, వెలుగు: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ లో ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘జపాన్ ఓపెన్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు హృదయపూర్వక అభినందనలు.
మీలోని పోరాట పటిమ, అచంచలమైన పట్టుదల, ప్రతిభ దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిని నింపాయి. మీరు సాధించే ప్రతి విజయం దేశానికి గర్వకారణం. అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత క్రీడా నైపుణ్యానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో విశ్వ వేదికపై మరిన్ని మైలురాళ్లను అధిగమించాలి. ఇలాగే రాణిస్తూ దేశ త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఎగరేయాలి’’ అని ఆకాంక్షించారు
