ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కావాలనే రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ఎంపీ కేకే అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఆయన సమాధానం చెప్పారు. బాయిల్డ్ రైస్ మీద ఇప్పటికే అయిదుసార్లు అవకాశమిచ్చామని.. అయినా తెలంగాణ ఆరోపణలు చేస్తోందని పీయూష్ అన్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే జరిగిన అగ్రిమెంట్ ప్రకారం FCIకి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా.. రబీ గురించి ఇప్పుడే ఎందుకు ప్రస్తావన తెస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ ఏడాది కొనుగోళ్లు పెంచుతున్నామని... అగ్రిమెంట్ ప్రకారమే కేంద్రం కొనుగోళ్లు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు కేంద్రానికి ఇవ్వాల్సిన పారా బాయిల్డ్ రైస్ కోటానే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని పీయూష్ గోయల్ అన్నారు.
