సమతామూర్తిని సందర్శించుకున్న కేంద్రమంత్రి

సమతామూర్తిని సందర్శించుకున్న కేంద్రమంత్రి

శంషాబాద్, వెలుగు :  కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కుటుంబంతో కలిసి ఆదివారం ముచింతల్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు.  ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కేంద్ర మంత్రి నేరుగా శ్రీరామనగరంలోని సమతా మూర్తి విగ్రహం వద్దకు వెళ్లి దర్శించుకున్నారు.  అనంతరం శ్రీ రామానుజుల బంగారు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, 108 దివ్య దేవాలయాలను పర్యటించారు.

సుమారు 3 గంటల పాటు కేంద్ర మంత్రి దంపతులు  సమతామూర్తి సన్నిధిలో గడిపారు  స్వర్ణ రామాజులవారి దర్శనం చేసుకుని వేద ఆశీర్వచనం అనంతరం చిన జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకోగా.. వారికి  తీర్థప్రసాదాలు అందించారు.