24 గంటల్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం: కాక్రోచ్ జనతా పార్టీతో చర్చల్లో కేంద్రం

24 గంటల్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం: కాక్రోచ్ జనతా పార్టీతో చర్చల్లో కేంద్రం

ఢిల్లీ: కేంద్ర మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చర్చలు ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ చర్చలు జరిగాయి. అంతిమంగా.. మూడు కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు చర్చల అనంతరం CJP ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాకు తెలిపారు.

ఈ మూడు డిమాండ్లలో రెండు డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునే విషయంలో రేపటి (జులై 25, శనివారం) వరకూ కేంద్ర మంత్రులు గడువు కోరినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రులకు స్పష్టం చేశామని చెప్పారు. ధర్మేంద ప్రధాన్ను కేబినెట్ నుంచి తొలగించకపోతే మరోసారి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తామని CJP ప్రతినిధులు కేంద్రాన్ని హెచ్చరించారు.

ALSO READ : ‘అసలు రిట్ పిటిషనే దాఖలు కాలేదు’: ఢిల్లీ నిరసనల వివాదంపై చీఫ్ జస్టిస్ క్లారిటీ

ఈ మూడు డిమాండ్లు ఏంటంటే.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించాలి. నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాలి. ఈ మూడు డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు CJP చర్చల అనంతరం స్పష్టమైంది.