V6 News

చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు దేశవ్యాప్తంగా మేళాలు

చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు దేశవ్యాప్తంగా మేళాలు

మాదాపూర్, వెలుగు: చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు దేశవ్యాప్తంగా మేళాలు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి దర్శనా జర్దోష్ తెలిపారు. మాదాపూర్​ శిల్పారామంలో జరుగుతున్న ఆలిండియా క్రాఫ్ట్ మేళాను మంగళవారం రాత్రి  ఆమె సందర్శించారు. అక్కడ  ఏర్పాటు చేసిన స్టాల్స్​ను పరిశీలించారు.

చేనేత కళాకారులతో మాట్లాడి వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రాఫ్ట్ మేళాతో చేనేత కళాకారులు వారి వస్తువులను ఈజీగా అమ్ముకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. శిల్పారామం స్పెషల్ అఫీసర్​ కిషన్​రావు,  జనరల్​ మేనేజర్​ అంజయ్య, క్రాఫ్ట్ మేళా నిర్వాహకులు అరుణ్​కుమార్​ పాల్గొన్నారు.