V6 News

ఎండలోనూ ఏసీ ఫీలింగ్: ముఖాన్ని రిఫ్రెష్ చేసే స్పెషల్ స్ప్రే బాటిల్ వచ్చేసింది!

ఎండలోనూ ఏసీ ఫీలింగ్: ముఖాన్ని రిఫ్రెష్ చేసే స్పెషల్ స్ప్రే బాటిల్ వచ్చేసింది!

ఎండాకాలంలో కాలు బయటపెడితే చాలు.. చెమటలు పట్టేస్తాయి. వెంటనే ముఖం కడుక్కోవాలి అనిపిస్తుంది. అలాంటి వాళ్లకు ఈ బాటిల్ బెస్ట్ చాయిస్. ఎంఎస్ఏ కంపెనీ తీసుకొచ్చిన ఈ బాటిల్ కు పైభాగంలో ఒక స్ప్రే మెకానిజం ఉంటుంది. అటామైజింగ్ నాజిల్ను నొక్కితే సన్నని తుంపర్లు వస్తాయి. చెమట పట్టినప్పుడు ముఖం మీద ఇలా నీళ్లు స్ప్రే చేసుకుంటే రిఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. ఈ బాటిల్ ను హై క్వాలిటీ మెటీరియల్తో తయారుచేశారు. చాలారోజులు మన్నికగా ఉంటుంది. లీక్ ప్రూఫ్ డిజైన్తో రావడం వల్ల ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీనికి వెడల్పాటి మూత ఉండడం వల్ల ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ఇది 600ఎంఎల్ కెపాసిటీతో వస్తుంది. ఇక దీని ధర రూ.393 మాత్రమే.