V6 News

పది ఫలితాల్లో యూనిక్ హైస్కూల్ ప్రతిభ  

పది ఫలితాల్లో యూనిక్ హైస్కూల్ ప్రతిభ  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్సెస్సీ ఫలితాల్లో యూనిక్  హైస్కూల్ సత్తా చాటింది. 146 మంది ఎగ్జామ్స్ రాయగా  146 మంది పాసయ్యారు. ఇందులో ఎన్‌. పూజశ్రీ 592 మార్కులతో టాపర్‌‌ గా నిలిచింది.  ఎం. లక్ష్మీ వెంకట సాయి 589 , కె. దేవీ ప్రియ 588, కె, సాయి ప్రణతి 588, ఎం. వర్షిణి 588 మార్కులు సాధించారు. 146 మందిలో 49 మందికి 550 నుంచి 580 వరకు మార్కులు రాగా, 114 మందికి 500 కు పైగా మార్కులు వచ్చాయి. విద్యార్థులు కష్టం, ఉపాధ్యాయుల కృషితోనే ఈ ఫలితాలు సాధ్యమైనట్లు కరస్పాండెంట్ పి. శివయ్య, ప్రిన్సిపాల్ ఎం. నాగభూషణం తెలిపారు.