V6 News

ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో పనికి వెళ్తుండగా దారి దోపిడీ

ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో పనికి వెళ్తుండగా దారి దోపిడీ

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ఇండస్ట్రియల్​ఏరియాలో దారి దోపిడీ జరిగింది. బిహార్​కు చెందిన నిత్యానంద్ సింగ్, అతని స్నేహితుడు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని జెర్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నడుచుకుంటూ డ్యూటీకి వెళ్తున్న వీరిద్దరిని ఐజీఎం సిమెంట్ కంపెనీ సమీపంలో ముగ్గురు దుండగులు ఒక్కసారిగా బైక్​పై వచ్చి చుట్టుముట్టారు. 

బాధితులను బెదిరించి వారి వద్ద ఉన్న రూ. 1,800 నగదును లాక్కొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.