లేబుల్ లేని 6 క్వింటాళ్ల పనీర్ స్వాధీనం.. నారపల్లిలో ఎస్‌‌‌‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడి

 లేబుల్ లేని 6 క్వింటాళ్ల పనీర్ స్వాధీనం.. నారపల్లిలో ఎస్‌‌‌‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడి

మేడిపల్లి, వెలుగు: నారపల్లి ప్రాంతంలో ఉప్పల్ ఎస్‌‌‌‌వోటీ పోలీసులు బుధవారం నిర్వహించిన ఆకస్మిక దాడిలో డేట్, లేబుల్ లేని సుమారు 600 కిలోల పనీర్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లు, రెండు ఆటోలు, రెండు వెయింగ్ మిషన్లను కూడా సీజ్​ చేశారు.

 పనీర్‌‌‌‌ను అక్రమంగా నిల్వ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ పనీర్‌‌‌‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి సరఫరా చేయాలనుకున్నారు, మరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.