విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పని సరి. అయితే వీసా పొందటం అంత ఈజీ కాదు. ముఖ్యంగా అమెరికాకు వెళ్లాలనుకునే వారు వీసా కోసం నానా పాట్లు పడుతుంటారు. అయితే భారతీయ చిన్నారులు, వయో వృద్ధులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. వీసా కావాలనుకుంటున్న చిన్నారులు, వృద్ధులకు.. సెప్టెంబరు 1 నుంచి జరగనున్న వీసా ఇంటర్వ్యూలో మినహాయింపు నిచ్చింది. ఇందులో 14 ఏళ్లలోపు బాలలు, 79 ఏళ్లకు మించి వయసున్న వారు అర్హులు. అంతేకాదు కొత్త దరఖాస్తులతోపాటు, రెన్యూవల్స్‌కూ ఇది వర్తిస్తుందంటూ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్‌కు భారత్‌లోని అమెరికా కాన్సులేట్ పంపిన ఈ మెయిల్‌లో తెలిపింది. అయితే కొన్ని సందర్భాల్లో అవసరమైతే వారికి కూడా వీసా ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పింది.
