అమెరికా పేపర్ కరెన్సీ (డాలర్ నోట్ల)పై త్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కనిపించనుంది. 1861లో డాలర్ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత, పదవిలో ఉన్న ఒక అధ్యక్షుడి సంతకం కరెన్సీపై ముద్రించడం ఇదే తొలిసారి. అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా యూఎస్ ట్రెజరీ ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ,ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సంతకం త్వరలో యూఎస్ కరెన్సీపై కనిపిస్తుందని, ఇది చరిత్రలో ఒక మైలురాయి అని యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఈ 250వ వార్షికోత్సవ వేడుకల కోసం ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల బంగారు స్మారక నాణెం తుది రూపకల్పనకు ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ మార్చి నెలప్రారంభంలో ఆమోదం తెలిపింది.
