పరిస్థితులు ఇలాగే ఉంటే అణు దాడి ముప్పు

 పరిస్థితులు ఇలాగే ఉంటే అణు దాడి ముప్పు
  • ఇంత తీవ్రమైన అణు ముప్పు 60 ఏళ్ల తర్వాత ఇప్పుడే
  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

మాన్ హట్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న అణు బాంబు బెదిరింపులు ఉత్తుత్తి బెదిరింపులు కాదని..  హాస్యాస్పదం కూడా కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఎలాగైనా సరే ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగాపుతిన్ అణుబాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. మన్ హట్టన్ నగరంలో డెమాక్రటిక్ పార్టీ విరాళాల సేకరణ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 

ఇవే పరిస్థితులు కంటిన్యూ అయితే .. 1962లో  క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత అమెరికా ఈ స్థాయి అణు ముప్పు చూడడడం ఇప్పుడేనని అన్నారు. ఉక్రెయిన్ లో ఆక్రమించిన భూభాగాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న పుతిన్ తనకున్న మార్గాలన్నీ మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్ చేసిన హెచ్చరికలపై జో బైడెన్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. క్యూబా సంక్షోభం తర్వాత తొలిసారి అమెరిక ప్రత్యక్షంగా అణుదాడి ముప్పు ఎదుర్కొంటటోందని.. అయితే పుతిన్ ను ఆ మార్గం నుంచి తప్పించడానికి తాము కసరత్తు చేస్తున్నట్లు  బైడెన్ తెలిపారు.