వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన సూపర్ సక్సెస్.. తెలంగాణ హక్కుల విషయంలో ఎక్కడా రాజీపడలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన సూపర్ సక్సెస్.. తెలంగాణ హక్కుల విషయంలో ఎక్కడా రాజీపడలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సూపర్ సక్సెస్ అయ్యిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బుధవారం ( సెప్టెంబర్ 2 ) మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ హక్కుల కోసం ఎక్కడా రాజీపడలేదని అన్నారు.నాలుగు ప్రాజక్టుల కోసం పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరామని... కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు.

సీడబ్ల్యూసీలో పెండింగ్ లో ఉన్న అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ సమస్యలను ప్రస్థావించామని.. తుమ్మిడిహెట్టి పై చర్చలు జరుపుతున్నామని... 152 మీటర్ల ఎత్తులో కట్టాలని డిమాండ్ చేశామని..ఆమేరకే కట్టెందుకు అనుమతి వస్తుందనే విశ్వాసం ఉందని అన్నారు ఉత్తమ్.

►ALSO READ | కాంగ్రెస్ 1000 రోజుల పాలన సూపర్ హిట్.. ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమం ఆపలే: మంత్రి పొంగులేటి

సీఎం రేవంత్ నాయకత్వం లో వెయ్యి రోజుల్లో ప్రజలకు మంచి పాలన అందించామని.. ప్రజాస్వామ్యపాలన, ప్రజా పాలన వచ్చిందనే భావన తెలంగాణ ప్రజల్లో ఉందని అన్నారు ఉత్తమ్.స్వతంత్ర భారతంలో ఎప్పుడు జరగనట్లుగా తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చామని...  మంచి క్వాలిటీ ఇందిరమ్మ ఇల్లు, ధాన్యం కొనుగోలు ఇట్లా అనేక సంక్షేమ పాలన ఇస్తున్నామని స్పష్టం చేశారు ఉత్తమ్.