కేటీఆర్‌‌ అధికారిక పర్యటనలోనూ వీ6, వెలుగుపై నిషేధం

కేటీఆర్‌‌ అధికారిక పర్యటనలోనూ వీ6, వెలుగుపై నిషేధం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌‌ అధికారిక పర్యటనలోనూ వీ6, వెలుగుపై నిషేధం విధించారు. చానల్, పేపర్ ప్రతినిధులు రావొద్దంటూ అధికారులతో ఫోన్ల ద్వారా చెప్పించారు. మంత్రిగా ప్రెస్‌‌మీట్, అది కూడా సీఎం అధికారిక నివాసంలో జరిగినా.. అదేదో బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ అయినట్లు బ్యాన్ చేశారు. అన్ని చానల్స్‌‌కు సమాచారం ఇచ్చి.. వీ6, వెలుగును మాత్రం రావద్దని చెప్పారు. ఈ వ్యవహారంపై సదరు అధికారిని ప్రశ్నించగా.. ‘‘మంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయి. నాకేమీ తెలియదు. పై నుంచి వచ్చే ఆర్డర్స్ ను నేను పాటిస్తున్నానంతే” అని చెప్పుకొచ్చారు.

వీ6, వెలుగును ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసంటూ ఇటీవల బెదిరింపులకు దిగిన కేటీఆర్.. తర్వాత కొన్ని రోజులకే వీ6, వెలుగు పత్రికలను తమ పార్టీ కార్యక్రమాలకు పిలువొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆదేశాలిచ్చారు. తెలంగాణ సెక్రటేరియెట్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు రానివ్వడం లేదు. ప్రభుత్వ పైసలతో జాతీయ మీడియాలో కోట్ల రూపాయలతో యాడ్స్ ఇస్తున్న తెలంగాణ సర్కార్.. వీ6, వెలుగుపై మాత్రం కక్ష సాధిస్తోంది.