V6 News

హైదరాబాద్ సిటీలో భక్తి శ్రద్ధలతో వైశాఖి సంబురాలు

హైదరాబాద్ సిటీలో భక్తి శ్రద్ధలతో వైశాఖి సంబురాలు

వైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖల్సా పంత్ స్థాపన దినోత్సవ వేడుకలు సిటీలో మంగళవారం వైభవంగా జరిగాయి. అమీర్​పేట్ నుంచి బేగంపేట్ వరకు సిక్కులు భారీ ర్యాలీ నిర్వహించారు. 

సిక్కు గురువుల బోధనలను స్మరిస్తూ సాగిన ఈ శోభాయాత్ర కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా యువకులు తమ సంప్రదాయ యుద్ధ కళలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు.  – పంజాగుట్ట, వెలుగు