బిల్లీ జీన్‌‌‌‌ కింగ్‌‌‌‌ కప్‌‌‌‌ టెన్నిస్ టోర్నీలో వైష్ణవి పరాజయం

 బిల్లీ జీన్‌‌‌‌ కింగ్‌‌‌‌ కప్‌‌‌‌ టెన్నిస్ టోర్నీలో వైష్ణవి పరాజయం

న్యూఢిల్లీ: బిల్లీ జీన్‌‌‌‌ కింగ్‌‌‌‌ కప్‌‌‌‌ టెన్నిస్ టోర్నీలో ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఆసియా/ఓసియానియా గ్రూప్‌‌‌‌–1లో భాగంగా మంగళవారం జరిగిన సింగిల్స్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌లో వైష్ణవి అడ్కర్‌‌‌‌ 1–6, 3–6తో అంచిసా చాంటా (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో పరాజయం చవిచూసింది. దాంతో ఇండియా 0–1తో వెనకబడింది.

వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌‌‌‌లో వైష్ణవి ఏ దశలోనూ లయ అందుకోలేదు. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. పచారిన్‌‌‌‌ చిప్‌‌‌‌చాందేజ్‌‌‌‌తో జరిగిన మరో సింగిల్స్‌‌‌‌లో తెలంగాణ ప్లేయర్‌‌‌‌ యమలపల్లి సహజ 4–6, 6–1, 3–4 ఉన్న దశలో వర్షం అడ్డంకిగా నిలిచింది. దాంతో మ్యాచ్‌‌‌‌ను బుధవారానికి వాయిదా వేశారు.