ప్రేమికుల దినోత్సవం: ఒక్కో దేశంలో ఒక్కోలా

ప్రేమికుల దినోత్సవం: ఒక్కో దేశంలో ఒక్కోలా

ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు కానీ అన్ని దేశాల్లో ఒకే రకంగా ఉండవు. ఒక్కో దేశంలో ఒక్కోలాగా జరుపుకుంటారు. అవేంటో చుద్దాం

జపాన్‌ లో ఫిబ్రవరి 14న అమ్మాయిలే అబ్బాయిలకు గిఫ్టులిస్తారు. మళ్లీ మార్చి 14న అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చనివి తిరిగివ్వాలి. దీన్ని ‘వైట్ డే’ అంటారు. ఇంగ్లాండ్‌ లో జాక్ వాలెంటైన్ వేషంలో చిన్నారులకు గిఫ్టులు పంచుతారు. దక్షిణాఫ్రికాలో నచ్చిన వ్యక్తుల పేర్లను భుజాలపై హార్ట్ షేపులో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. బ్రెజిల్‌ లో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 కాదు జూన్ 12. ఈ రోజును ‘సెయింట్ ఆంటోనీస్ డే’ పేరుతో ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిలిప్పీన్స్‌‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతాయి. ఇక సౌదీ అయితే ఏకంగా జైలుకే.. ఆ రోజు ఎర్ర గులాబీ పట్టుకున్నా చాలు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.

మన దేశంలో ప్రేమికుల దినోత్సవం రోజున నచ్చిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ప్రేమికుల రోజును వ్యతిరేకించే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్‌ లో కూడా వాలెంటైన్స్ డే ను కొంతమంది వ్యతిరేకిస్తారు. అక్కడ కొన్ని నగరాల్లో దీనిని అధికారికంగానే నిషేధించారు. ఫ్రాన్స్‌‌లో కూడా వాలెంటైన్స్ డే రోజున జరిగే ‘లవ్ లాటరీ’ విద్వేషాలకు దారితీస్తుండంతో అక్కడి ప్రభుత్వం నిషేధించింది.