బాబు పాప్‌కార్న్‌పై వర్మ సెటైర్.. తమ్ముళ్ల రివర్స్ ట్రోలింగ్

బాబు పాప్‌కార్న్‌పై వర్మ సెటైర్.. తమ్ముళ్ల రివర్స్ ట్రోలింగ్

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో పాప్ కార్న్ తింటూ సరదాగా తిరుగుతున్న వీడియో 2 రోజులుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆర్జీవీ ట్వీట్ చేశాడు. రోజుకు 20 గంటలపాటు కష్టపడే వ్యక్తి.. ఇపుడు పాప్ కార్న్ తింటూ వీధుల్లో తిరుగుతున్నారు అంటూ సెటైర్ వేశారు.

దీనిపై నెజిటన్లు తమదైన స్టైల్లో రియాక్టయ్యారు. పవర్ లో లేడుకదా.. చంద్రబాబుకు ఇప్పుడే తీరిక దొరికింది.. తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు కొందరు. తెలుగు తమ్ముళ్లైతే… రామును ఫుల్లుగా ట్రోల్ చేశారు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ బీర్ మీద పోసుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. కొన్నేళ్లకిందట మంచి సినిమాలు తీసిన వర్మ.. ఇపుడు బీర్లు పట్టుకుని పిచ్చిపిచ్చిగా డాన్సుచేసుకుంటున్నాడంటూ రివర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.